cm: కేసీఆర్ వ్యాఖ్యల వల్లే ఆర్టీసీ కార్మికులు చనిపోయారు: అశ్వత్థామరెడ్డి

  • ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర
  • సమస్య పరిష్కరించడం ప్రభుత్వానికి ఇష్టం లేదు
  • కార్మికులు ధైర్యం కోల్పోవద్దు, బ్రతికి సాధించుకుందాం

సీఎం కేసీఆర్ వ్యాఖ్యల వల్లే 21 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయారని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు సమ్మెను పొడిగించేలా ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. కమిటీ ఏర్పాటు చేస్తామని కోర్టు చెప్పినా ప్రభుత్వం వినడం లేదని, కార్మికుల సమస్యను పరిష్కరించడం ప్రభుత్వానికి ఇష్టం లేదని విమర్శించిన అశ్వత్థామరెడ్డి, తమ సమ్మె కొనసాగుతుందని అన్నారు. ఆర్టీసీ కార్మికులు ధైర్యం కోల్పోవద్దని, బ్రతికి సాధించుకుందామని, రేపటి భవిష్యత్ తమదే అని అన్నారు. ఈ నెల 18 వరకు జేఏసీ ప్రణాళిక ఉందని చెప్పిన ఆయన, చర్చలకు ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా సిద్ధంగా ఉన్నామని అన్నారు.  

  • Loading...

More Telugu News