students: విద్యార్థుల్లోని ఒత్తిడిని దూరం చేసేందుకట.. ‘సమాధి’లో ధ్యానం!
- రాడ్బౌడ్ యూనివర్సిటీ వినూత్న ఆలోచన
- పచ్చని చెట్ల మధ్య సమాధులు.. వాటిపై దిండ్లు
- అక్కడ ధ్యానంతో ఒత్తిడి సమాధి అవుతుందట
విద్యార్థుల్లోని ఒత్తిడిని దూరం చేసేందుకు నెదర్లాండ్స్, నిజ్మాజెన్ నగరంలోని రాడ్బౌడ్ యూనివర్సిటీ ‘సమాధి’ ఆలోచనతో ముందుకొచ్చింది. పచ్చని చెట్ల మధ్య గొయ్యిని తవ్వి అందులో సమాధిలాంటి దానిని ఏర్పాటు చేసి దానిపై దిండు, యోగా మ్యాట్‌ను ఏర్పాటు చేసింది.
విద్యార్థులు అందులో పడుకుని అర గంట నుంచి మూడు గంటలపాటు ధ్యానం చేసుకోవచ్చు. అయితే, ఇందులోకి మొబైల్ ఫోన్లు, పుస్తకాలను అనుమతించరు. ఈ విధానం వల్ల విద్యార్థుల్లోని ఒత్తిడి సమాధి అవుతుందని యూనివర్సిటీ పేర్కొంది. గతంలోనే ఈ పద్ధతిని ప్రవేశపెట్టగా అప్పట్లో 39 మంది విద్యార్థులు దీనిని వినియోగించుకున్నారు. విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థనలతో తాజాగా మళ్లీ వీటిని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.