Congress: సుప్రీంకోర్టు చెప్పిందిగా.. యడియూరప్ప ప్రభుత్వాన్ని రద్దు చేయండి: కాంగ్రెస్

  • బీజేపీ ప్రభుత్వం అనైతికమైనదని తేలిపోయింది
  • బీజేపీకి ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా వారికి టికెట్లు ఇవ్వొద్దు
  • సుప్రీంకోర్టు తీర్పుపై కుమారస్వామి విస్మయం

కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూల్చివేతలో బీజేపీ హస్తం ఉందని సుప్రీంకోర్టు తీర్పుతో స్పష్టమైందని, కాబట్టి యడియూరప్ప ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం అనైతికమైనదని సుప్రీంకోర్టు రుజువు చేసిందని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ దినేశ్ గుండూరావు అన్నారు. బీజేపీకి ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా పార్టీ ఫిరాయించిన ఆ 17 మందికి టికెట్లు ఇవ్వకూడదని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపుదారులకు సుప్రీంతీర్పు ఓ గుణపాఠమని అన్నారు. బీజేపీ నాయకత్వంపైనా, ముఖ్యమంత్రి యడియూరప్ప ఆడియో టేపులపైనా విచారణ జరిపాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ‌దీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటును సమర్థించిన సుప్రీంకోర్టు వారిని ఎన్నికల్లో పోటీకి అనుమతించడంపై మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి విస్మయం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News