sad news: కలుషిత నీరు కారణంగా ఇద్దరు చిన్నారుల మృతి
- హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో విషాదం
- కార్పొరేషన్ సరఫరా చేస్తున్న నీటితోనే ప్రమాదం
- లబోదిబోమంటున్న బాధిత కుటుంబం
మంచినీరు ఇద్దరు చిన్నారుల ప్రాణాలను తీసింది. కార్పొరేషన్ నల్లాల ద్వారా సరఫరా అవుతున్న నీరు కలుషితం కావడంతో ఆ నీరు తాగి ఇద్దరు చిన్నారులు చనిపోయారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎం.ఎం.పహాడీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
ఆ ప్రాంతానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేస్తున్న నీరు కలుషితమవుతోందని స్థానికులు గుర్తించారు. ఈ విషయం పై సంబంధిత అధికారులు పలు మార్లు ఫిర్యాదు చేశారు. కానీ వారు పట్టించుకోక పోవడంతో నీటి కాలుష్యం ఇద్దరి ప్రాణాలు తీసింది. సమస్య తెలియజేసినా పట్టించుకోని అధికారుల తీరు తమ కడుపుకోతకు కారణమయ్యిందని బాధిత కుటుంబం సభ్యులు మండిపడుతున్నారు.