Road Accident: ట్రాక్టర్ అదుపుతప్పడంతో.. ముగ్గురు కూలీల దుర్మరణం

  • పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద ఘటన
  • గడ్డి లోడుతో వెళ్తుండగా ఘటన
  • సహాయ సహకారాలు అందించిన స్థానికులు

గడ్డిలోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి పొలంలోకి దూసుకు పోవడంతో వెనుక తొట్టె (ట్రాలీ) బోల్తా కొట్టింది. దీంతో గడ్డిపై కూర్చున్న ముగ్గురు కూలీలు మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద ఈ రోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఇంజన్ భాగం యథాతథంగా ఉండగా వెనుక ట్రాలర్ మాత్రం తిరగబడింది. దీంతో గడ్డి కింద కూలీలు చిక్కుకుని ఊపిరాడక మరణించారు. స్థానికులు వెంటనే స్పందించి సహాయ సహకారాలు అందించినప్పటికీ వారి ప్రాణాలు కాపాడలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Road Accident
tractor trally reverse
three died
West Godavari District
unguturu

More Telugu News