Cricket: చెలరేగి ఆడుతోన్న మయాంక్.. 150 పరుగులు చేసి, బౌలర్లకు చుక్కలు చూపిస్తోన్న బ్యాట్స్ మెన్
- 78 ఓవర్ల నాటికి మూడు వికెట్ల నష్టానికి భారత్ 284 పరుగులు
- క్రీజులో మయాంక్, రహానె
- రోహిత్, పుజారా, కోహ్లీ ఔట్
ఇండోర్ వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ చెలరేగి ఆడుతున్నాడు. 238 బంతుల్లో 152 పరుగులు చేశాడు. అందులో 21 ఫోర్లు 3 సిక్సులు ఉన్నాయి. భారత్ 78 ఓవర్ల నాటికి మూడు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. మయాంక్‌తో కలిసి అజింక్యా రహానె చక్కగా రాణిస్తున్నాడు. 144 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేశాడు.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకి ఆలౌటైన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో విశాఖపట్నంలో జరిగిన తొలి టెస్టులో మయాంక్ డబుల్ సెంచరీ చేసి అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. ఈ టెస్టులోనే డబుల్ సెంచరీ చేస్తాడన్న అంచనాలు మొదలయ్యాయి. కాగా, రోహిత్ శర్మ 6, పుజారా 54, కోహ్లీ 0 పరుగులకు వెనుదిరిగారు.