Trupti Desai: రక్షణ కల్పించకపోయినా శబరిమలకు వెళ్తా: తృప్తి దేశాయ్

  • నేడు తెరుచుకోనున్న శబరిమల తలుపులు
  • రేపటి నుంచి స్వామిని దర్శించుకోనున్న భక్తులు
  • ఈ నెల 20వ తేదీ తర్వాత శబరిమల వెళ్తానన్న తృప్తి
శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్లబోతున్నానని మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ ప్రకటించారు. ఈ నెల 20వ తేదీ తర్వాత శబరిమల వెళ్తున్నానని... తనకు రక్షణ కల్పించినా, కల్పించకపోయినా వెళ్లడం ఖాయమని చెప్పారు. ఇంతకు ముందు కూడా అయ్యప్పను దర్శించుకునేందుకు తృప్తి దేశాయ్ యత్నించి విఫలమైన సంగతి తెలిసిందే.

మరోవైపు, కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్ మాట్లాడుతూ, ప్రచారం కోసం శబరిమల రావాలనుకునే మహిళలకు రక్షణ కల్పించబోమని స్పష్టం చేశారు. ఈరోజు శబరిమల తలుపులు తెరుచుకోనున్నాయి. రేపటి నుంచి స్వామివారిని భక్తులు దర్శించుకోవచ్చు.
Trupti Desai
Sabarimala

More Telugu News