BCCI: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు లేవన్న ఎథిక్స్ అధికారి
- గంగూలీపై మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు ఫిర్యాదు
- గంగూలీకి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపణ
- విచారణ చేపట్టిన ఎథిక్స్ అధికారి
బీసీసీఐ నూతన అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి పరస్పర విరుద్ధ ప్రయోజనాల వివాదం నుంచి ఉపశమనం లభించింది. గంగూలీకి ఎలాంటి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు లేవని, ఆయన ఒకటికి మించి ఎక్కువ పదవుల్లో లేడని బీసీసీఐ ఎథిక్స్ అధికారి డీకే జైన్ వెల్లడించారు. గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టకముందే బెంగాల్ క్రికెట్ సంఘం చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడని జైన్ స్పష్టం చేశారు. అంతకుముందు, గంగూలీకి విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం శాశ్వత సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేయడంతో ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్ విచారణ చేపట్టారు.