Nara Lokesh: లోకేశ్ పప్పు అయితే జగన్ పిడత కింద పప్పా!: సీఎంకు కూడా మంచి పేరు సెలక్ట్ చేయమని వంశీని కోరిన వర్ల రామయ్య
- చంద్రబాబు, లోకేశ్ లపై వంశీ విమర్శలు
- వర్ల రామయ్య ప్రెస్ మీట్
- వంశీపై ఆగ్రహం
ఏపీలో వల్లభనేని వంశీ వ్యవహారం ఇంకా సద్దుమణగలేదు. టీడీపీకి రాజీనామా చేసిన ఈ గన్నవరం ఎమ్మెల్యే పార్టీ అధినేత చంద్రబాబుపైనా, ఆయన తనయుడు లోకేశ్ పైనా చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రేకెత్తించాయి. ముఖ్యంగా వర్ల రామయ్య ఒంటికాలిపై లేచారు. తాజాగా ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, లోకేశ్ ను పప్పు అంటూ వల్లభనేని వంశీ వ్యాఖ్యానిస్తున్నారని, లోకేశ్ స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో చదువుకున్నారని వెల్లడించారు. లోకేశ్ చిన్నప్పటి నుంచి ఇంగ్లీషు మీడియం చదవడం వలన తెలుగులో ఒకట్రెండు తప్పులు మాట్లాడి ఉండొచ్చని, అంతమాత్రాన పప్పు అయిపోతాడా అంటూ మండిపడ్డారు.
లోకేశ్ పప్పు అయితే సీఎం జగన్ ను పిడత కింద పప్పు అనాలా? అంటూ ప్రశ్నించారు. "ముఖ్యమంత్రి జగన్ ఏంచదివారండీ, కనీసం నిరక్షరాస్యత అనే మాట కూడా అనలేకపోయారు. మనమధ్యే పెరిగి, మన మధ్యే చదువుకున్న జగన్ ను ఏమని పిలవాలి" అని నిలదీశారు. జగన్ కు కూడా సరైన పేరు పెట్టే బాధ్యతే వంశీదేనని అన్నారు. సీఎంకు కూడా కరెక్ట్ గా సూటయ్యే పేరును వంశీనే రేపట్లోగా సూచించాలని అన్నారు.