BJP: ముస్లిం లా బోర్డు నిర్ణయంపై మండిపడిన రాజాసింగ్
- ముస్లిం లా బోర్డులో హైదరాబాద్‌కు చెందిన ఓ ద్రోహి ఉన్నారు
- మొఘలుల కాలంలో 40 వేల ఆలయాలు ధ్వంసం
- సుప్రీం తీర్పుతో హిందూ ముస్లింలలో సంతోషం
అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలన్న అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ముస్లిం లా బోర్డు అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఆ బోర్డులోని అవినీతిపరుల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ ద్రోహి కూడా ఉన్నారంటూ పరోక్షంగా అసదుద్దీన్‌ను ఉద్దేశించి ఆరోపించారు.
మొఘలుల హయాంలో 40 వేల ఆలయాలను ధ్వంసం చేసి మసీదులను నిర్మించారని రాజాసింగ్ ఆరోపించారు. వాటన్నింటిని తిరిగి నిర్మించాలని హిందువులు డిమాండ్ చేస్తారని అన్నారు. సుప్రీం తీర్పుతో హిందూ, ముస్లింలు ఆనందంగా ఉన్నారన్నారు. ఈ సమస్యకు ఇక్కడితో ముగింపు పలకాలని రాజాసింగ్ హితవు పలికారు.