gambhir: ఆ సమయంలో ఏమైందో ఇప్పుడు చెబుతున్నా: ధోనీపై గంభీర్ తీవ్ర ఆరోపణలు

  • 2011 ప్రపంచకప్ ఫైనల్ లో 97 పరుగులు చేసి ఔట్‌ అయిన గంభీర్‌
  • మరో మూడు పరుగులు చేస్తే సెంచరీ చేసే వాడిని
  • ధోనీ నాకు సెంచరీ చేసే అవకాశం ఇవ్వలేదు
  • తన వ్యక్తిగత స్కోరును పెంచుకోవడం కోసం ప్రయత్నించాడు 

ఎనిమిదేళ్ల క్రితం జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్‌ మ్యాచ్‌లో తాను శతకం చేసే అవకాశాన్ని మూడు పరుగుల దూరంలో కోల్పోవడానికి కారణం అప్పటి టీమిండియా సారథి ధోనినే అంటూ మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ఆరోపణలు గుప్పించారు. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో శ్రీలంకపై  భారత్‌ గెలుపొందిన విషయం తెలిసిందే.  ఆ మ్యాచ్ లో గంభీర్‌ 97 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు.

తాజాగా గంభీర్ ఈ విషయంపై స్పందిస్తూ... తాను మరో మూడు పరుగులు చేస్తే సెంచరీ చేసే వాడినని, ఆ సమయంలో ఏమైందో ఇప్పుడు చెబుతున్నానని అన్నారు. తాను సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉండగా తన వద్దకు ధోనీ వచ్చాడని, మూడు పరుగులు చేస్తే సెంచరీ పూర్తవుతుందని జ్ఞాపకం చేశాడని, అయితే, తన మనసులో సెంచరీ కొట్టడం కంటే ప్రపంచ కప్‌ను గెలవడమే ముఖ్యమనే ఆలోచన మాత్రమే ఉందని గంభీర్ చెప్పుకొచ్చారు.

ధోనీ అలా చెప్పడంతోనే తాను సెంచరీ చేయాలని ఆలోచించానని, అయితే, ఆ తర్వాత ధోనీ తనకు సెంచరీ చేసే అవకాశం ఇవ్వకుండా తన వ్యక్తిగత స్కోరును పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తూ, 'గేమ్' మొదలెట్టాడని, దీంతో తనలో అసహనం వచ్చిందని, పెరీరా బౌలింగ్‌లో తాను బౌల్డ్‌ అయ్యానని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News