budda venkanna: అఖిలపక్ష భేటీలో చివాట్లు తిన్న మీకు వచ్చిన ఆక్రోశాన్ని అర్థం చేసుకోగలం: విజయసాయి రెడ్డిపై బుద్ధా వెంకన్న సెటైర్లు

  • పీపీఏల విషయంలో కేంద్రం మొట్టికాయలు వేసింది
  • నవ్విపోదురుగాక మాకేటి సిగ్గంటూ జగన్ గారు రాష్ట్రాన్ని అంధకారం చేశారు
  • సోలార్ విద్యుత్ కి అంతరేటా? అంటూ విద్యుత్ కోతలు విధిస్తున్నారు 

సోలార్‌ పవర్‌ రూ.2.80కే సప్లై చేయడానికి ఎన్టీపీసీ, సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్ ముందుకొచ్చాయని, గతంలో కమీషన్లకు కక్కుర్తిపడి చంద్రబాబు నాయుడు.. యూనిట్‌ రూ.5 చొప్పున ప్రైవేట్‌ సంస్థలతో పీపీఏలు కుదుర్చుకుని రాష్ట్రంపై పెను భారం మోపాడని వైసీపీ విజయసాయి రెడ్డి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు.

'అఖిలపక్ష సమావేశంలో చివాట్లు తిన్న తరువాత మీకు వచ్చిన ఆక్రోశాన్ని అర్థం చేసుకోగలం విజయసాయి రెడ్డి గారు. పీపీఏల విషయంలో కేంద్రం మొట్టికాయలు వేసినా నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అంటూ జగన్  గారు రాష్ట్రాన్ని అంధకారం చేశారు. సీఎం ఉంటోన్న తాడేపల్లిలోనే కరెంట్ పీకేస్తున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దోమలు, ఎలుకల నివారణకు అంత ఖర్చా? అని వితండవాదనచేసి వెనక్కితగ్గలేక విషజ్వరాలతో ప్రజల్ని పొట్టనపెట్టుకున్నారు. ఇప్పుడు సోలార్ విద్యుత్ కి అంతరేటా అంటూ విద్యుత్ కోతలు విధిస్తున్నారు' అని బుద్ధా వెంకన్న ట్వీట్లు చేశారు.
 
'మీ ప్రభుత్వం తీసుకుంటున్న చెత్త నిర్ణయాలతో దేశంలో ఎక్కడా పెట్టుబడి పెట్టడానికి విద్యుత్ కంపెనీలు ముందుకు రావడం లేదు. జగన్ గారి పేరు చెప్పగానే పెట్టుబడిదారులు  మాయమవుతున్నారు. మీ పాలన చూసాక ఏకంగా కేంద్రప్రభుత్వం ప్రత్యేకచట్టం తీసుకొస్తుంది అంటేనే మీది ఎంత గొప్పపాలనో అర్థమవుతుంది' అని బుద్ధా వెంకన్న విమర్శించారు.
 
'విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు ఇబ్బందిపడకుండా జే ట్యాక్స్ నుండి రక్షణ కల్పిస్తూ కేంద్రం ప్రత్యేకచట్టం తీసుకొస్తుంది. ప్రపంచానికి లెక్కలు చేప్పే జగన్ గారికి, మీకు టెక్నాలజీ అభివృద్ధిచెందే క్రమంలో పునరుత్పాదక విద్యుత్ రేట్లు తగ్గుతాయని తెలియకపోవడం అమాయకత్వమని మాత్రం అనుకోలేం' అని బుద్ధా వెంకన్న మరో ట్వీట్ లో విమర్శలు గుప్పించారు. 

  • Loading...

More Telugu News