Editor Mohan: 'బావ బావమరిది'లో మొదట బాలకృష్ణను అనుకున్నాను: ఎడిటర్ మోహన్
- తమిళంలో యావరేజ్ గా ఆడింది
- తెలుగులోకి రీమేక్ చేశాను
- సూపర్ హిట్ అయిందన్న ఎడిటర్ మోహన్
తెలుగులో చాలా సినిమాలకి ఎడిటర్ మోహన్ పనిచేశారు. తెలుగులో కొన్ని సినిమాలకి ఆయన నిర్మాతగాను వ్యవహరించారు. అలా ఆయన ఒక నిర్మాతగా వ్యవహరించిన చిత్రాల్లో 'బావ బావమరిది' ఒకటి. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాను గురించి మాట్లాడుతూ, "తమిళంలో ఈ కథ ఆడియన్స్ కి యావరేజ్ గా మాత్రమే ఎక్కింది. అయితే తెలుగు ఆడియన్స్ కి ఈ పాయింట్ బాగా నచ్చుతుందని నాకు అనిపించింది. దాంతో తెలుగు రీమేక్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే బాధ్యతను నాపై వేసుకున్నాను.
'బావ బావమరిది'లో 'బావ' పాత్రకి ముందుగా బాలకృష్ణను అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. దాంతో ఈ పాత్రకి కృష్ణంరాజు అయితే బాగుంటుందని భావించి ఆయనను ఎంపిక చేసుకున్నాను. ఆయన ఆ పాత్రకి ఒక నిండుదనం తీసుకొచ్చారు. ఈ సినిమా 175 రోజులు ఆడింది .. 'బావలు సయ్యా ..' రేంజ్ లో సక్సెస్ అయిన ఐటమ్ సాంగ్ ఇంతవరకూ రాలేదు" అని చెప్పుకొచ్చారు.