Sensex: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 72 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 10 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- నాలుగున్నర శాతానికి పైగా లాభపడ్డ భారతి ఎయిర్ టెల్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. మధ్యాహ్న సమయంలో భారీ నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు ఆ తర్వాత కొంతమేర కోలుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 72 పాయింట్ల నష్టంతో 40,284కు పడిపోయింది. నిఫ్టీ 10 పాయింట్లు కోల్పోయి 11,884 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (4.60%), సన్ ఫార్మా (2.42%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.82%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.18%), వేదాంత లిమిటెడ్ (1.16%).
టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-4.44%), బజాజ్ ఆటో (-2.05%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.59%), ఓఎన్జీసీ (-1.55%), హీరో మోటో కార్ప్ (-1.49%).