Guntur District: గుంటూరులో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. అనుమానం రాకూడదని కాలేజీ హాస్టళ్ల పక్కనే దందా!
- చినకాకాని ప్రాంతంలో దుకాణం తెరిచిన వ్యభిచార ముఠా
- పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు
- నిర్వాహకులు సహా ఆరుగురి అరెస్ట్
ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కాలేజీ పక్కనే దుకాణం తెరిచిన వ్యభిచార ముఠా గుట్టును గుంటూరు జిల్లా పోలీసులు రట్టు చేశారు. చినకాకాని ప్రాంతంలో ప్రైవేటు కళాశాలల హాస్టళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతం విద్యార్థులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో అయితే ఎవరికీ అనుమానం రాదన్న ఉద్దేశంతో ఓ వ్యభిచార ముఠా ఇక్కడ దందా ప్రారంభించింది.
ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో దాడులు చేసిన పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు విటులు, నలుగురు నిర్వాహకులు ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.11 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.