Narendra Modi: పాక్ పన్నాగాలను సాగనివ్వబోము: రాజ్ నాథ్ సింగ్ హెచ్చరిక

  • రెండు రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ లో రక్షణ మంత్రి
  • ఆర్టికల్ 370పై చెప్పిందే చేశాం
  • ప్రవాస భారతీయులతో నరేంద్ర మోదీ

పక్కనే ఉండి, దుష్ట పన్నాగాలు పన్నుతున్న పాకిస్థాన్ ఆగడాలు ఇకపై సాగనివ్వబోమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. ప్రస్తుతం రెండు రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ లో ఉన్న ఆయన, ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. పాక్ దుర్మార్గపు ఆటలకు అడ్డుకట్ట వేస్తామని అన్నారు. ఇండియాలో ఓ పూర్తి స్థాయి రాష్ట్రం ఇతర ప్రాంతాలతో ఏకీకృతం కాలేదని, అది దురదృష్టకరమని కాశ్మీర్ ను ఉద్దేశించి రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు.

ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావిస్తూ, నిర్దిష్ట పరిస్థితుల కారణంగానే అప్పట్లో ఈ అధికరణను తెచ్చారని, బీజేపీ ఏర్పడినప్పటి నుంచి ప్రతిసారి ఎన్నికల మేనిఫెస్టోల్లో దీన్ని రద్దు చేస్తామని తాము హామీ ఇస్తూనే ఉన్నామని గుర్తు చేశారు. కశ్మీర్‌ ను భారత్‌ లో అంతర్భాగం చేసి తీరుతామని తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని అన్నారు.

ఆర్టికల్ 370 రద్దు తరువాత భారత్‌ తో దౌత్య సంబంధాలకు పాక్ గండికొడుతూ వస్తోందని, ఇండియన్ సినిమాలను పాక్‌ థియేటర్లలో ప్రదర్శించడం లేదని, థార్, సంఝౌతా ఎక్స్‌ ప్రెస్‌ లను నిలిపివేశారని రాజ్ నాథ్ ఆరోపించారు. అక్టోబర్ 31న జమ్మూకశ్మీర్, లడఖ్‌ లు అధికారికంగా ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతాలయ్యాయని అన్నారు.

  • Loading...

More Telugu News