onions: భారీగా పెరిగిన ఉల్లి ధరలు... ఐదేళ్లలో గరిష్ఠ ధర
- కర్నూలు మార్కెట్ లో అత్యధిక ధర
- క్వింటాలుకు రూ.6270
- వరదల ప్రభావంతో పడిపోయిన ఉల్లి దిగుబడి
దిగుబడి తగ్గిపోవడంతో దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కర్నూలు మార్కెట్ లో ఉల్లి ధర భారీగా పెరిగిపోయింది. ఈ రోజు క్వింటాలుకు రూ.6270 పలుకుతోంది. ఐదేళ్లలో ఉల్లికి ఇదే గరిష్ఠ ధర. వరదల ప్రభావంతో ఇటీవల ఉల్లి దిగుబడి భారీగా తగ్గిన విషయం తెలిసిందే. దీంతో ధరలు గణనీయంగా పెరిగిపోతున్నాయి.
బహిరంగ మార్కెట్లో కిలో రూ.60 నుంచి రూ.70కు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో రూ.100 పలుకుతోంది. రైతు బజార్లలో రూ.25కే విక్రయించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ నెలాఖరుకు విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకోవాలని ప్రయత్నాలు జరుపుతోంది. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతులు ఇప్పటికే ఆగిపోయాయి.