Tpcc: వీహెచ్ కూడా పీసీసీకి సమర్థుడే: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

  • పార్టీలో అన్ని వర్గాల వారికి పీసీసీ అడిగే హక్కు వుంది
  • సామాన్య కార్యకర్త కూడా పీపీసీ అధ్యక్షుడయ్యే ఛాన్స్  
  • రెడ్లు, బ్రాహ్మణులే కాదు బీసీల్లోనూ సమర్థులు ఉన్నారు
తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో అన్ని వర్గాల వారికి పీసీసీ అడిగే హక్కు వుందని అన్నారు. తమ పార్టీలో ధనిక, పేద అనే తేడా వుండదని అందరూ సమానులేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సమస్త కులాల వాళ్లూ వున్నారని, వారిలో చాలా మంది సమర్థవంతమైన నేతలున్నట్టు తెలిపారు. రెడ్లు, బ్రాహ్మణులే కాదు, బీసీల్లోనూ సమర్థులున్నారని, వీహెచ్ కూడా పీసీసీ పదవికి సమర్థుడేనని, మాదిగ కులంలో దామోదర రాజనర్సింహ, మాలల్లో భట్టి విక్రమార్క వున్నారని అన్నారు. సామాన్య కార్యకర్త బొల్లు కిషన్ కూడా పీపీసీ అధ్యక్షుడయ్యే ఛాన్స్ వుందని వ్యాఖ్యానించారు.
Tpcc
VH
Mla
Jaggareddy
congress

More Telugu News