High Court: నా క్యారెక్టర్ కు ఇంత అవమానమా?: 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'పై హైకోర్టును ఆశ్రయించిన కేఏ పాల్!
- హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేఏ పాల్
- ప్రతివాదులుగా సెన్సార్ బోర్డ్, వర్మ, కమేడియన్ రాము
- మధ్యాహ్నం తరువాత విచారణకు వచ్చే అవకాశం
ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'పై మరో కేసు దాఖలైంది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ ను అవమానించేలా చూపించారంటూ క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్, హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని కోరుతూ, పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ కేసులో ప్రతివాదులుగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ, సెన్సార్ బోర్డు, రామ్ గోపాల్ వర్మ, జబర్దస్త్ కమేడియన్ రాము తదితరులను చేర్చారు. కేఏ పాల్ పిటిషన్ పై నేటి మధ్యాహ్నం తరువాత హైకోర్టులో విచారణ జరుగనుందని సమాచారం. కాగా, ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.