BJP UNion Minister Kishan Reddy: షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

  • సమ్మె పరిష్కారానికి కేంద్రం ప్రయత్నిస్తుంది
  • కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర బీజేపీ ఎంపీల వినతి
  • ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి కేంద్రానికి అధికారం ఉంది

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పడుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగకుండా.. షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ విషయంపై కేంద్రం చొరవ తీసుకోవాలని, రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారన్నారు. చాలా రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెపై కేంద్రం కల్పించుకుని సమస్య పరిష్కారం చేయాలంటూ ఒక వినతి పత్రాన్ని ఆయనకు సమర్పించారని తెలిపారు. కాగా, గడ్కరీ కూడా సానుకూలంగా స్పందించారని కిషన్ రెడ్డి చెప్పారు. దీనిపై చర్చించడానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, అధికారులను ఢిల్లీకి పిలుస్తామన్నారు. ఆర్టీసీ విభజన పూర్తిస్థాయిలో జరగనందున ఈ అంశంలో జోక్యానికి కేంద్రానికి అధికారం ఉందన్నారు.

  • Loading...

More Telugu News