NRI Husbands: ఎన్నారై భర్తల వేధింపులపై 6 వేల మంది భార్యల ఫిర్యాదు: విదేశాంగ శాఖ
- ఐదేళ్లలో విదేశాంగశాఖకు వెల్లువెత్తిన ఫిర్యాదులు
- ఎన్నారై భర్తల నుంచి సమస్యలను ఎదుర్కొంటున్న పలువురు మహిళలు
- ఈ ఏడాది ఇప్పటి వరకు 991 ఫిర్యాదులు
మన దేశంలో ఎన్నారై అల్లుళ్లకు ఉన్న డిమాండ్ ఏంటో తెలిసిందే. తమ కూతుళ్ల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందనే ఆశతో ఎన్నారై అల్లుళ్ల కోసం అమ్మాయిల తల్లిదండ్రులు ఆరాటపడుతుంటారు. అయితే, ఎన్నారైలను పెళ్లాడిన పలువురు మహిళలు ఆ తర్వాత తమ భర్తల నుంచి ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో, పలువురు తమ భర్తలపై విదేశాంగ శాఖకు ఫిర్యాదులు కూడా చేస్తుంటారు.
గత ఐదేళ్ల కాలంలో 6 వేల మంది వివాహితలు తమ ఎన్నారై భర్తలపై భారత విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని లోక్ సభలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ తెలిపారు. ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు బదులుగా సమాధానమిస్తూ... 2015లో 796 మంది, 2016లో 1510 మంది, 2017లో 1498 మంది, 2018లో 1299 మంది, ఈ ఏడాది 991 మంది తమ భర్తలపై ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు.