Robert Fayaz: రాజీవ్ హత్య కేసు దోషుల్లో మరొకరికి పెరోల్ మంజూరు!
- 28 ఏళ్లుగా జైల్లో రాబర్ట్ ఫయాజ్
- కుమారుడికి పెళ్లి నిశ్చయమైందని పిటిషన్
- 30 రోజుల పెరోల్ మంజూరు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషిగా నిరూపితుడై, యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న మరో ఖైదీకి పెరోల్ లభించింది. ఈ కేసులో గత 28 ఏళ్లుగా జైల్లో ఉన్న రాబర్ట్ ఫయాజ్ కు 30 రోజుల పెరోలు మంజూరు చేస్తూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
తన కుమారుడు తమిళ్ కో పెళ్లి నిశ్చయమైందని, తనకు పెరోల్ కావాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన న్యాయమూర్తులు ఎంఎం సుందరేశ్, ఆర్ఎంటి టీకారామన్ లు పెరోల్ మంజూరు చేశారు. అంతకుముందు ఇద్దరు న్యాయమూర్తులూ, ఈ విషయమై అన్నాడీఎంకే సర్కారు అభిప్రాయాన్ని కూడా అడిగారు. పెరోల్ మంజూరు చేయడానికి అభ్యంతరం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది స్పష్టం చేయడంతో 30 రోజుల పాటు పెరోల్ ను మంజూరు చేస్తూ న్యాయమూర్తులు తీర్పిచ్చారు.