Bonda Uma: ఆంగ్ల భాషను తామే కనిపెట్టినట్లు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు: బోండా ఉమ
- నాడు-నేడు ఒక బోగస్ కార్యక్రమం
- దీని వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు
- అప్పట్లో ‘ఆంగ్లం వద్దు.. తెలుగు ముద్దు’ అన్నారు
- నేతలు ఇప్పుడు మాత్రం 'మాతృభాష వద్దు' అంటున్నారు
బాలల దినోత్సవం సందర్భంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమంపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ విమర్శలు గుప్పించారు. ఇది ఒక బోగస్ కార్యక్రమమని, దీని వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని వ్యాఖ్యానించారు. ఆంగ్ల భాష అవసరం గురించి మొదట స్పందించింది తమ పార్టీయేనని ఆయన అన్నారు.
గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ‘ఆంగ్లం వద్దు.. తెలుగు ముద్దు’ అన్న వైసీపీ నేతలు ఇప్పుడు మాత్రం 'మాతృభాష వద్దు' అని అంటున్నారని బోండా ఉమా విమర్శించారు. ఆంగ్ల భాషను తామే కనిపెట్టినట్లు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని చురకలంటించారు.