NCP legislature new leader dilip valse: ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా దిలీప్ వాల్సే ఎన్నిక
- అజిత్ ను పార్టీ నుంచి తొలగించినట్లు ప్రకటించిన అధిష్ఠానం
- తిరుగుబాటుచేసి కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీకి మద్దతిచ్చిన అజిత్
- ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన అజిత్ పవార్
మహారాష్ట్ర లో ఎన్సీపీ శాసనసభా పక్ష నేత అజిత్ పవార్ ను తొలగిస్తూ పార్టీ అధిష్ఠానం ప్రకటన చేసింది. ఓపక్క కాంగ్రెస్, శివసేనలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్ధమవుతున్న సమయంలో ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ 9 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీకి మద్దతు తెలపడంతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో అజిత్ ను పార్టీ నుంచి తొలగించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనను శాసనసభా పక్ష నేతగా కూడా తొలగించినట్లు సమాచారం. కొత్త శాసనసభా పక్ష నేతగా దిలీప్ వాల్సేను ఎన్నిక చేశారని తెలుస్తోంది.