ncp: రాజ్ భవన్ కు వెళ్లిన కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన నేతలకు..ఢిల్లీలో గవర్నర్!

  • రాజ్ భవన్ కు ఏక్ నాథ్ షిండే, అశోక్ చవాన్, జయంత్ పాటిల్
  • ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న గవర్నర్ కోష్యారీ
  • సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం

మహారాష్ట్ర అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన నేతలు  రాజ్ భవన్ కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఏక్ నాథ్ షిండే, అశోక్ చవాన్, జయంత్ పాటిల్ రాజ్ భవన్ కు వెళ్లి పలు అంశాలపై గవర్నర్ తో చర్చించాలనుకున్నారు. అయితే, ప్రస్తుతం గవర్నర్ కోష్యారీ ఢిల్లీలో ఉన్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ వెంటనే బలపరీక్ష ఎదుర్కొనేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుపై వివరణ ఇవ్వాలని నిన్న సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు నోటీసులు జారీ చేసింది. వారి సమాధానాలను పరిశీలించి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.

  • Loading...

More Telugu News