Supreme Court: 54 మంది ఎమ్మెల్యేల సంతకాలు వున్నాయి కానీ, వారు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారా?: అభిషేక్ సింఘ్వి

  • ఎన్సీపీ నేతలు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు కవరింగ్ లెటర్ ఇవ్వలేదు
  • అది కేవలం 54 మంది ఎమ్మెల్యేల సంతకాల జాబితా మాత్రమే
  • బల పరీక్షకు రెండు పక్షాలు సిద్ధంగా ఉన్నాయి
  • బలపరీక్ష ఎప్పుడనేదే ఇప్పుడు ప్రశ్న

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై సుప్రీంకోర్టులో ఎన్సీపీ తరఫున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. ఎన్సీపీ నేతలు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు కవరింగ్ లెటర్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందన్నారు. అది కేవలం 54 మంది ఎమ్మెల్యేల సంతకాల జాబితా మాత్రమేనని తెలిపారు.

బల పరీక్షకు రెండు పక్షాలు సిద్ధంగా ఉన్నాయని, కానీ అదెప్పుడనేదే ఇప్పుడు ప్రశ్న అని అభిషేక్ సింఘ్వి అన్నారు. గవర్నర్ కు అజిత్ పవార్ సమర్పించిన లేఖలో 54 మంది ఎమ్మెల్యేల సంతకాలు వున్నాయి.. కానీ, వారు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారా? అని ప్రశ్నించారు. ఆ లేఖలో బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ఎక్కడా లేదని స్పష్టం చేశారు. వెంటనే బలపరీక్ష నిర్వహించాలని ఆయన కోరారు. రెండు పక్షాలు బలపరీక్షకు సిద్ధంగా ఉన్నప్పుడు అఫిడవిట్లు, సమాధానాలు ఎందుకని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News