Sensex: దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు
- 530 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 159 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 7 శాతానికి పైగా పెరిగిన ఎయిర్ టెల్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సూచీలు లాభాల్లోనే పయనించాయి. అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు మెరుగుపడబోతున్నాయనే అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 530 పాయింట్ల లాభంతో 40,889కి ఎగబాకింది. నిఫ్టీ 159 పాయింట్లు పుంజుకుని 12,074కు పెరిగింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (7.20%), టాటా స్టీల్ (4.99%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.49%), యాక్సిస్ బ్యాంక్ (3.10%), వేదాంత లిమిటెడ్ (2.74%).
టాప్ లూజర్స్:
బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం ఓఎన్జీసీ (-2.17%), యస్ బ్యాంక్ (-1.70%) మాత్రమే నష్టపోయాయి.