Telangana: ఆర్డీసీ ఎండీ ప్రకటన దురదృష్టకరం: జగ్గారెడ్డి

  • సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన అశ్వత్థామరెడ్డి
  • కార్మికులను విధుల్లోకి తీసుకోబోమన్న సునీల్ శర్మ
  • కాంగ్రెస్ కార్యకర్తలు అండగా నిలబడాలని జగ్గారెడ్డి పిలుపు

తెలంగాణ ఆర్టీసీ తాత్కాలిక ఎండీ సునీల్ శర్మపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమించి విధుల్లో చేరతామని ప్రకటించినా తీసుకోబోమని చెప్పడం దురదృష్టకరమన్నారు. నేడు విధుల్లో చేరబోతున్న కార్మికులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.

ఆర్టీసీ జేఏసీ నేతలు నిన్న సమ్మెను స్వచ్ఛందంగా విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీ భవితవ్యం, కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. దీంతో 50 రోజులకుపైగా సాగిన సమ్మెకు ఫుల్‌స్టాప్ పడింది. షిఫ్టులతో సంబంధం లేకుండా ఉదయం ఆరు గంటలకే కార్మికులు విధులకు వెళ్లాలని సూచించారు. అయితే, కార్మికులు సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని సునీల్ శర్మ స్పష్టమైన ప్రకటన చేశారు.

  • Loading...

More Telugu News