Bindu: గత జనవరిలో పరుగులు పెడుతూ వెళ్లి అయ్యప్పను దర్శించుకున్న ఆ బిందూయే... నేడూ వచ్చి ఆసుపత్రి పాలు!

  • జనవరిలో పోలీసుల సాయంతో స్వామి దర్శనం
  • కనకదుర్గతో పాటు కలిసివచ్చిన బిందు
  • ఆలయం వద్ద భారీ భద్రత
బిందూ అమ్మణ్ణి, కనకదుర్గ... ఈ రెండు పేర్లూ గుర్తున్నాయా? ఈ సంవత్సరం జనవరిలో శబరిగిరిని ఎక్కి, పోలీసుల సాయంతో అయ్యప్పను దర్శించుకుని వచ్చిన మహిళలు. ఆపై వీరు సమాజంలోను, కుటుంబీకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు కూడా. ఇప్పుడు వారిద్దరిలోని బిందూ అమ్మణ్ణి, మరోసారి స్వామిని దర్శించుకునేందుకు వచ్చి ఆసుపత్రి పాలైంది. ఈ ఉదయం ఆమెపై భక్తులు కారం చల్లగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ సంవత్సరం జనవరిలో ఆలయంలోకి పరుగులు పెడుతూ వెళ్లిన్న బిందూ, కనకదుర్గలు స్వామిని దర్శనం చేసుకున్న వీడియోలు అయ్యప్ప భక్త సమాజంలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆపై ఆలయాన్ని మూసివేసిన ప్రధానార్చకులు, శుద్ధి చేయడం కూడా వివాదాస్పదమైంది.

ఇక తాజా ఘటనతో అయ్యప్ప ఆలయం వద్ద పోలీసుల సంఖ్యను భారీగా పెంచారు. వాహనాలను నీలక్కల్ వద్దే నిలిపి, అక్కడి నుంచి బస్సులలో భక్తులను పంబ వరకూ తరలిస్తున్నారు.
Bindu
Sabarimala
Kanakadurga

More Telugu News