Maharashtra: మెజారిటీ నిరూపించుకోకుండా ఎందుకు పారిపోతున్నారు?: సంజయ్ రౌత్

  • బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది
  • సత్యమేవ జయతే నినాదాన్ని కూడా ఖూనీ చేశారు
  • వారెందుకు భయపడుతున్నారు?
  • మాకున్న మద్దతును తెలపడానికే మూడు పార్టీల ఎమ్మెల్యేలు కలిశారు

మెజారిటీ నిరూపించుకోవడానికి బీజేపీ భయపడుతోందని, ఆ పార్టీ నేతలు పారిపోతున్నారని శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ తో ప్రమాణస్వీకారం చేయించి బీజేపీ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. సత్యమేవ జయతే అనే దేశ నినాదాన్ని కూడా ఖూనీ చేశారు. వారెందుకు భయపడుతున్నారు? మెజారిటీ నిరూపించుకోకుండా ఎందుకు పారిపోతున్నారు? న్యాయం కోసం మేము సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించాల్సి వస్తుంది?' అని వ్యాఖ్యానించారు.

'రాజ్యాంగంపై ఈ రోజు పార్లమెంటులో చర్చ జరుపుతున్నారు. ఇది అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమేనా? మాకు 162 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. నిన్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఒకే చోట కలిశారు. మేము బల ప్రదర్శన చేస్తున్నామని మీడియా పేర్కొంది. కానీ, మాకున్న మద్దతును మహారాష్ట్ర ప్రజలకు, రాష్ట్రపతి భవన్, రాజ్ భవన్ కు తెలపడానికే మేమంతా ఒకేచోట కలిశాం' అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News