Telangana: కేసీఆర్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి: భట్టి విక్రమార్క పిలుపు
- కేసీఆర్ కు రాజ్యాంగం అంటే లెక్కే లేదు
- భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తున్నారు
- ప్రజాస్వామ్య వాదులంతా ఏకతాటిపైకి రావాలి
రాజ్యహింసతో భావప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ పై టీ-కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేసీఆర్ కు రాజ్యాంగం అంటే లెక్కే లేదని, ఆయన నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని అన్నారు. ప్రజలకు ఆత్మగౌరవం లేకుండా చేస్తున్న కేసీఆర్ ను ప్రశ్నించాల్సిందేనని, ప్రజాస్వామ్య వాదులంతా ఏకతాటిపైకి రావాలని పిలుపు నిచ్చారు. కేసీఆర్ కు ఆర్టీసీ ఉద్యోగులపై కోపమెందుకు అని ప్రశ్నించిన భట్టి విక్రమార్క, ఐఏఎస్ అధికారులు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.