Maharashtra protem speaker Kalidhas kolambker appointed: మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కోలంబ్కర్ నియామకం
- ఆరుగురు సీనియర్ ఎమ్మెల్యేల పేర్లను పరిశీలించిన గవర్నర్
- గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన కాళిదాస్
- కొలంబ్కర్ సమక్షంలోనే రేపు బలపరీక్ష
మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కొలంబ్కర్ నియమితులయ్యారు. ఆయనతో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ పదవికోసం రాధాకృష్ణ పాటిల్ (బీజేపీ), బాబన్ రావు భికాజీ (బీజేపీ), కాళిదాస్ కోలంబ్కర్ (బీజేపీ), కేసీ పద్వి (కాంగ్రెస్), బాలాసాహెబ్ థోరత్ (కాంగ్రెస్), దిలీప్ వాల్సే పాటిల్ (ఎన్సీపీ) పేర్లను గవర్నర్ పరిశీలించారు.
సీనియారిటీ ఎక్కువ ఉన్న వారికి ప్రొటెం స్పీకర్ బాధ్యతలను కట్టబెట్టడం ఆనవాయతీ. ఈ నేపథ్యంలో కాళిదాస్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయడంతో కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. రేపు తమ మెజారిటీ నిరూపణ చేయనున్నాయి. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు.