BJP: మహారాష్ట్రతోనే బీజేపీ కౌంట్ డౌన్ మొదలైంది!: సీపీఐ నారాయణ

  • మహారాష్ట్ర రాజకీయాలపై నారాయణ స్పందన
  • పార్లమెంట్ లో రాష్ట్రపతి, మోదీ గొప్ప ఉపన్యాసమిచ్చారు!
  • ఒక ప్రెస్టీజియస్ ప్రైమ్ మినిస్టర్ కు శృంగభంగం

భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నేటితో 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్లమెంట్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ లు ప్రసంగించిన అంశాన్ని, మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులకు ముడిపెడుతూ సీపీఐ సీనియర్ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంట్ లో రాష్ట్రపతి, మోదీలు గొప్ప ఉపన్యాసం ఇచ్చారంటూ సెటైర్లు విసిరారు. ఎంత మంచి ఉపన్యాసం ఇచ్చారంటే.. ‘వాళ్ల మాటల్లో ఏమో వెజిటేరియన్, ఆచరణలో నాన్-వెజిటేరియన్’లా కనిపించిందని విమర్శించారు. ఒక ప్రెస్టీజియస్ ప్రైమ్ మినిస్టర్ కు శృంగభంగం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని నడి వీధుల్లో ఖూనీ చేయాలని ప్రయత్నించారు’ అని ఆరోపించారు.

మహారాష్ట్రతోనే బీజేపీ కౌంట్ డౌన్ మొదలైందని, ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శరద్ పవార్ పై కేసులు మాత్రం అలాగే వుంటాయా? అజిత్ పవార్ ను ఉపముఖ్యమంత్రిని చేసిన రెండు గంటల్లోనే ఆయనపై వున్న అవినీతి కేసులన్నీ మాఫీ అయిపోతాయా? అంటూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఎంత పనికిమాలిన వాళ్లైనా బీజేపీలో చేరితే పవిత్రులైపోతారా? మిగిలిన వాళ్లు దేశద్రోహులవుతారా? అంటూ బీజేపీపై నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News