Prakasam District: ప్రకాశం జిల్లాలో వాహనదారులను బెదిరిస్తున్న ట్రాన్స్ జెండర్ల అరెస్టు
- పొదిలి, అద్దంకి, సింగరాయకొండ ప్రాంతాల్లో ట్రాన్స్ జెండర్ల బెదిరింపులు
- వృద్ధులకు సాయం పేరుతో మత్తుమందు ఇచ్చి దోపిడీ
- నలుగురు ట్రాన్స్ జెండర్ల అరెస్టు
ప్రకాశం జిల్లాలో వాహనదారులను బెదిరించి దోపిడీకి పాల్పడుతున్న ట్రాన్స్ జెండర్లను పోలీసులు అరెస్టు చేశారు. బంగారు నగలు, డబ్బు దోచుకున్న నలుగురు ట్రాన్స్ జెండర్లను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇంకొల్లు మండలంలోని జలుగులుపాలెంలో వృద్ధురాలి మరణానికి వీళ్లే కారకులని చెప్పారు. నిందితుల నుంచి ఇన్నోవా కారు, రూ.17 లక్షల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పరారీలో వున్న మరో ఐదుగురు ట్రాన్స్ జెండర్ల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.
పొదిలి, అద్దంకి, సింగరాయకొండ, ఒంగోలు రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో బెదిరింపులకు పాల్పడి దోపిడీ చేస్తున్నట్టు చెప్పారు. వృద్ధులకు సాయం పేరుతో ఆటోలో తీసుకెళ్లి వారికి మత్తుమందు ఇచ్చి దోపిడీ చేస్తున్నారని తెలిపారు. బ్యాంకులు, బస్టాపుల వద్ద ప్రజల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు.