Srilanka: శ్రీలంక మాజీ క్రికెటర్ మురళీధరన్ కు అరుదైన గౌరవం..గవర్నర్ గా నియామకం?
- శ్రీలంక అధ్యక్షుడి నుంచి ప్రత్యేక ఆహ్వానం
- నార్త్ ప్రావిన్స్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించాలని విజ్ఞప్తి
- అంగీకరించిన మురళీధరన్?
శ్రీలంక మాజీ క్రికెటర్, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ కు అరుదైన గౌరవం దక్కింది. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారని, నార్త్ ప్రావిన్స్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించాలని కోరినట్టు సమాచారం. రాజపక్స విజ్ఞప్తి మేరకు గవర్నర్ బాధ్యతలను మురళీధరన్ స్వీకరిస్తాడని తెలుస్తోంది. ఈస్ట్ ప్రావిన్స్ కు అనురాధ యహంపతి, నార్త్ సెంట్రల్ ప్రావిన్స్ కు తిస్సా వితర్ణ లు గవర్నర్లుగా బాధ్యతలు స్వీకరించనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.
కాగా, 1992లో టెస్టు క్రికెట్ లో,1993లో వన్డే క్రికెట్ లోకి ముత్తయ్య మురళీధరన్ ప్రవేశించాడు. తన క్రికెట్ కెరీర్ లో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి మురళీధరన్ తప్పుకున్నాడు.