Karnataka: ఇబ్బందుల్లో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే.. అశ్లీల వీడియో వైరల్!
- యువతితో సన్నిహితంగా ఉన్న కర్ణాటక ఎమ్మెల్యే
- వీడియో వైరల్ చేసిన మాజీ ఎమ్మెల్యే అల్లుడు
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
కర్ణాటకలో అధికార బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే శృంగార వీడియో బహిర్గతమై, వైరల్ అవుతోంది. గదగ్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఓ యువతితో సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, రోణ ప్రాంతానికి చెందిన మంజునాథ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో అనుమానితుడైన మాజీ ఎమ్మెల్యే శ్రీశైలప్ప బిరదూరుకు అల్లుడైన ఉదయ్ దేశాయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియోను ఎప్పుడు తీశారన్న విషయమై విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. కర్ణాటకలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఈ అశ్లీల వీడియో వ్యవహారం, ఇప్పుడు కాక పుట్టిస్తోంది.