Fastag: టోల్ ప్లాజా 'ఫాస్టాగ్ స్టిక్కర్' తీసుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

  • సంబంధిత లేన్లో మాత్రమే వెళ్లాలి
  • స్టిక్కర్ రీడైన వెంటనే ముందుకు సాగాలి
  • వాహనాల మధ్య కచ్చితంగా దూరం పాటించాలి

జాతీయ రహదారిపై టోల్ గేట్ ఉందంటే వాహన చోదకులకు ఆందోళనే. ఎందుకంటే అక్కడ ఎంత పెద్ద వాహన క్యూ ఉంటుందో, ఎంత సమయం పడుతుందో అన్న బెంగ. అత్యవసర పనిమీద వెళ్తున్న వారికి ఇది మరింత ఆందోళన కలిగించే అంశం. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ ప్రభుత్వం 'ఫాస్టాగ్' వినియోగాన్ని అమల్లోకి తెస్తున్న విషయం తెలిసిందే.


దేశవ్యాప్తంగా త్వరలో ఈ విధానం అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా వాహనాల ముందుభాగంలో విండ్ షీల్డ్ గ్లాస్ కి స్టిక్కర్ అంటిస్తారు. ఇలా ఈ విధనంలో భాగస్వాములు అయిన వారు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే వేగంగా వెళ్లాలన్న ఆశ నిరాశగా మారడమేకాక మరింత సమయం వెచ్చించాల్సి రావచ్చు. తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే...

టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ వాహన చోదకుల కోసం ప్రత్యేక లేన్లు ఉంటాయి. వాటిని గుర్తించి ఆ మార్గంలోనే వెళ్లాలి. ఇందుకోసం ఆ లేన్లో వేలాడే బోర్డులను గమనించాలి. అలాగే లేన్లోకి 25 నుంచి 30 కిలోమీటర్ల వేగానికి మించి వెళ్లకూడదు. ముందు వాహనానికి కనీసం 10 మీటర్ల దూరం పాటించాలి. మీ ఫాస్టాగ్ స్టిక్కర్ రీడ్ అవ్వగానే వాహనం ముందున్న గేటు తెరుచుకుంటుంది. అక్కడి గ్రీన్ లైట్ కొద్ది సేపు వెలుగుతుంది.

ఈలోగా మీ వాహనాన్ని ముందుకు నడిపించాలి. ఆలస్యం చేస్తే లైట్ ఆగి, గేటు పడిపోతుంది. ఒకవేళ స్టిక్కర్ రీడింగ్ లో ఇబ్బంది తలెత్తితే అక్కడి సిబ్బంది తమ వద్ద ఉన్న మిషన్ తో స్కాన్ చేసి పనిపూర్తి చేస్తారు. అప్పటికీ ఇబ్బంది ఎదురైతే టోల్ ఫీజు మ్యాన్యువల్ గా చెల్లించి వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్, మ్యాన్యువల్ వసూలు విధానం ఉంటుంది. అటువంటి చోట సిబ్బంది స్టిక్కర్లు స్కాన్ చేసే వరకు ఆగాలి.

  • Loading...

More Telugu News