TRs graph decreasing: తెలంగాణలో టీఆర్ఎస్ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
- కేంద్రం నుంచి వచ్చే నిధులను దారి మళ్లిస్తోందని ఆరోపణ
- రాష్ట్రంలో 12వేల ప్రభుత్వ పాఠశాలలు మూతబడి బార్లు తెరుచుకున్నాయి
- అర్టీసీ కార్మికులపై తుపాకి ఎక్కుపెట్టి సమ్మెను నిర్వీర్యం చేశారు
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రాఫ్ క్రమంగా పడిపోతోందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. సంగారెడ్డిలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకు పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే నిధులను దారి మళ్లిస్తోందని ఆరోపించారు. అర్టీసీ కార్మికులపై తుపాకి ఎక్కుపెట్టి సమ్మెను నిర్వీర్యం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో 12 వేల ప్రభుత్వ పాఠశాలలు మూతబడి బార్లు తెరుచుకున్నాయని ఎద్దేవా చేశారు.