Chandrababu: ఇది రైతుల దాడి కాదు, ప్రభుత్వ దాడి!: చంద్రబాబునాయుడు ఆగ్రహం

  • నా పర్యటనను ఓ ఇష్యూ చేయాలని చూశారు
  • వైసీపీ వాళ్లు తమ మనుషులతో చెప్పులు, రాళ్లు వేయించారు
  • కాన్వాయ్ పై దాడి ఘటనపై చంద్రబాబు స్పందన

ఏపీ రాజధాని అమరావతి పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్ పై దాడి ఘటన తెలిసిందే. ఈ ఘటనపై చంద్రబాబు స్పందించారు. ‘టీవీ9’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎప్పుడూ జరగని దాడి ఇప్పుడే జరిగిందంటే దాని అర్థమేంటి? అని ప్రశ్నించారు. రాజధానిలో తన పర్యటనను ‘ఓ ఇష్యూ’ చేయాలని చెప్పి వైసీపీ నాయకులు వాళ్ల మనుషులను తీసుకొచ్చి చెప్పులు, రాళ్లు వేసే పరిస్థితికి వచ్చారని ఆరోపించారు.

నిరసన తెలిపేందుకు ఆమోదించామని ఏపీ డీజీపీ అన్నారని, రేపు సీఎం పర్యటిస్తే తాము కూడా నిరసన తెలుపుతామంటే పర్మిషన్ ఇస్తారా? అని సూటిగా ప్రశ్నించారు. ‘నా కాన్వాయ్ వస్తూ వుంటే వాళ్లొచ్చి రాళ్లు వేస్తూ వుంటే పోలీసులు పర్మిషన్ ఇస్తారా? ప్రభుత్వ దాడి కాదా ఇది? దీని కన్నా నీచం ఏముంది? ఇది రైతుల దాడి కాదు? దాడి చేస్తే మేము భయపడతామా?’ అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News