Telangana cabinet meet: ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు...'రేపటి నుంచి విధుల్లో చేరవచ్చని' చెప్పిన సీఎం కేసీఆర్!

  • ముగిసిన కేబినెట్ సమావేశం
  • అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్
  • ప్రజల పొట్టలు నింపామే తప్ప ఎవరి పొట్టా కొట్టలేదు

తెలంగాణలో ఆర్టీసీ సమస్యకు ముగింపు తేవాలని కేబినెట్ భేటీలో నిర్ణయించామని సీఎం కేసీఆర్ అన్నారు. కార్మికులందరూ రేపు విధుల్లో చేరవచ్చని తీపి కబురు అందించారు. ఆర్టీసీ బతకాలన్నదే తమ ఉద్దేశమని చెప్పుకొచ్చారు. కార్మికులు ఎలాంటి కండిషన్లు లేకుండా విధుల్లో చేరవచ్చన్నారు. దీంతో దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న కార్మికుల సమ్మెకు చరమ గీతం పాడినట్టయింది.

ఈ రోజు జరిగిన కేబినేట్ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో సమావేశమై వివరాలను వెల్లడించారు. విపక్షాలు కార్మికులకు లేనిపోని ఆశలు కల్పించాయని విమర్శించారు. ఆర్టీసీ విషయంలో లేబర్ కోర్టు తమకు ఇంకా సమయం ఇచ్చిందన్నారు. రాజకీయ నిరుద్యోగులు ఆర్టీసీ సమ్మె విషయంలో హంగామా సృష్టించారని, కార్మికులు యూనియన్ల మాటలు నమ్మారన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రజల పొట్టలు నింపడమే తప్ప ఎవరి పొట్టా కొట్టలేదని కేసీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News