TTD: టీటీడీ ఆగమ సలహామండలి కీలక ప్రతిపాదన
- వసంతోత్సవాలు, కలశాభిషేకాలు రద్దు చేయాలని సూచన
- మలయప్పస్వామి బింబ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలన్న మండలి
- ఏడాదికి ఒక రోజు చేస్తే సరిపోతుందని వెల్లడి
ఇటీవలే కొత్తగా కొలువుదీరిన టీటీడీ ఆగమ సలహామండలి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వసంతోత్సవాలు, విశేషపూజ, కలశాభిషేకం సేవలు రద్దు చేయాలని ఆగమ సలహామండలి పాలకవర్గానికి సూచించింది. 600 ఏళ్ల క్రితం లభించిన మలయప్పస్వామి బింబ పరిరక్షణ కోసం సేవలు రద్దు చేయాలని పేర్కొంది. ప్రతినిత్యం స్నపన తిరుమంజనం నిర్వహించడం వల్ల బింబం అరుగుదల సంభవిస్తుందని సలహామండలి సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇకపై ఏడాదికి ఒకరోజు వసంతోత్సవాలు, సహస్ర కలశాభిషేకం, విశేషపూజలు నిర్వహించాలని ఆగమ పండితులు ప్రతిపాదించారు.