Tirumala: తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భక్తుల రద్దీ!

  • నిన్నటివరకూ సాధారణ రద్దీ
  • వారాంతం రావడంతో పోటెత్తిన భక్తులు
  • దర్శనానికి 20 గంటల సమయం

తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. నిన్నటివరకూ సాధారణ రద్దీ కనిపించగా, వారాంతం సమీపించడంతో ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు. ఈ ఉదయం  శ్రీవారి సర్వదర్శనం కోసం 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్, దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు 3 గంటల వరకూ సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. రేపటికి రద్దీ మరింతగా పెరగవచ్చని అంచనా వేశారు. కాగా, నిన్న గురువారం శ్రీవారిని 65,409 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ. 3.39 కోట్ల ఆదాయం లభించింది. ఇక కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులకు అన్న పానీయాలను సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News