block hole: భారీ కృష్ణ బిలాన్ని కనుగొన్న చైనా శాస్త్రవేత్తలు
- భూమికి 15 వేల కాంతి సంవత్సరాల దూరంలో
- ఎల్‌బీ-1గా నామకరణం
- సూర్యుడి కంటే 70 రెట్లు ఎక్కువగా ద్రవ్యరాశి
చైనా శాస్త్రవేత్తలు భారీ బ్లాక్ హోల్ (కృష్ణ బిలాన్ని) కనుగొన్నారు. సూర్యుడి ద్రవ్యరాశి కంటే ఈ బ్లాక్‌హోల్ ద్రవ్యరాశి 70 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. భూమికి 15 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ భారీ కృష్ణ బిలానికి ఎల్‌బీ-1 అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పాలపుంతలో కనుగొన్న అన్ని కృష్ణ బిలాల్లో కంటే ఇదే అత్యంత భారీ బ్లాక్ హోల్ అని తెలిపారు. ప్రస్తుతం దీనిపై పరిశోధనలు సాగిస్తున్నట్టు పేర్కొన్నారు.