Corrupt State: అవినీతి రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఏపీల స్థానం ఎంతో తెలుసా?
- అవినీతి రాష్ట్రాల్లో 5వ స్థానంలో తెలంగాణ
- 13వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్
- అత్యంత అవినీతి రాష్ట్రం రాజస్థాన్
దేశంలోనే అత్యంత అవినీతి చోటుచేసుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ 5వ స్థానంలో నిలిచి అపకీర్తిని మూటకట్టుకుంది. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈ జాబితాలో 13వ స్థానంలో నిలిచి కొంత బెటర్ అనిపించుకుంది. ట్రాన్స్ పెరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా సంస్థ నిర్వహించిన 'ఇండియా కరప్షన్ సర్వే-2019'లో ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి.
అతి తక్కువ అవినీతి కలిగిన రాష్ట్రంగా కేరళ ఘన కీర్తీని సొంతం చేసుకుంది. గోవా, ఒడిశాలు కూడా అవినీతికి అత్యంత దూరంగా ఉన్న రాష్ట్రాలుగా నిలిచాయి. మొత్తం 21 రాష్ట్రాల్లో ఈ సర్వేను ట్రాన్స్ పెరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... ఆస్తుల రిజిస్ట్రేషన్, భూ వివాదాల అంశాల్లో ఎక్కువ అవినీతి చోటుచేసుకుంది.
మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని తేలింది. తమ పనులు చేయించుకోవడానకి లంచాలను ఇచ్చినట్టు 67 శాతం మంది ప్రజలు తెలియజేశారు. పలుమార్లు లంచాలను ఇవ్వాల్సి వచ్చిందని 56 శాతం మంది తెలిపారు. 11 శాతం మంది మాత్రం ఎలాంటి లంచాలు ఇవ్వకుండానే తమ పనులు అయ్యాయని చెప్పారు.
ఇండియాలో టాప్ 15 అవినీతి రాష్ట్రాలు ఇవే:
- రాజస్థాన్
- బీహార్
- జార్ఖండ్
- ఉత్తరప్రదేశ్
- తెలంగాణ
- కర్ణాటక
- పంజాబ్
- తమిళనాడు
- చత్తీస్ ఘడ్
- మధ్యప్రదేశ్
- మహారాష్ట్ర
- ఉత్తరాఖండ్
- ఆంధ్రప్రదేశ్
- గుజరాత్
- ఢిల్లీ