YSRCP: వైసీపీలో చేరిన కారెం శివాజీ... కండువా కప్పిన జగన్!
- వైసీపీలోకి వలసలు
- టీడీపీని వీడి జగన్ పక్షాన చేరిన కారెం శివాజీ
- ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా
ఏపీలో అధికార వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. టీడీపీలో దళిత నేతగా గుర్తింపు సంపాదించుకున్న కారెం శివాజీ తాజాగా వైసీపీలో చేరారు.పార్టీలో చేరేందుకు వీలుగా ఆయన నిన్ననే ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ మధ్యాహ్నం ఆయనకు సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వగా, అరకు ఎంపీ మాధవితో కలిసి సీఎం కార్యాలయానికి వచ్చారు. జగన్ ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు.
కారెం శివాజీ 2014 ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిలో నియమితులయ్యారు. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో అనేకమంది నామినేటెడ్ పదవులకు రాజీనామా చేసినా కారెం శివాజీ మాత్రం ఇప్పటివరకు కొనసాగారు. వైసీపీలో చేరాలని నిశ్చయించుకున్న తర్వాతే నిన్న పదవికి రాజీనామా చేశారు.