onion: పెరిగిపోయిన ధరలు... ఉల్లి కోసం విశాఖపట్నంలో కిలోమీటర్ల మేర లైన్లు
- దీంతో రైతుబజార్ల వద్ద ప్రజలు క్యూలో నిలబడి పడిగాపులు
- విశాఖపట్నంలోని అన్ని రైతు బజార్ల ముందు ఉల్లి కోసం బారులు
- దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.110
మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో పంటలు దెబ్బతినడంతో దేశ వ్యాప్తంగా ఉల్లిపాయ ధరలు ఆకాశాన్నంటుతోన్న విషయం తెలిసిందే. ఉల్లి ఉత్పత్తి భారీగా తగ్గిపోవడంతో దేశ వ్యాప్తంగా కొన్ని చోట్ల కిలో ఉల్లిపాయల ధర రూ.110కి చేరింది. గ్రామాల్లోని అనేక కూరగాయల దుకాణాల్లో ఉల్లిపాయలే దొరకడం లేదు.
దీంతో రైతుబజార్ల వద్ద ప్రజలు క్యూలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. విశాఖపట్నంలోని అన్ని రైతు బజార్ల ముందు ప్రజలు ఉల్లి కోసం బారులు తీరారు. ఈ రోజు కొన్ని కిలోమీటర్ల మేర లైన్లు కట్టారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పంట మార్కెట్లోకి రావడానికి దాదాపు మరో నెల రోజుల సమయం ఉంది. దీంతో ఉల్లికి డిమాండ్ బాగా పెరిగిపోతోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సగటున ఉల్లి ధర రూ.80గా ఉంది.