Central Minister: హైదరాబాద్ లో ఆరు వేల మంది రోహింగ్యాలు వున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • బర్మా ఎక్కడ వుంది? హైదరాబాద్ ఎక్కడుంది?
  • ఇక్కడ ఎవరు షెల్టర్ ఇస్తే వచ్చారు?
  •  ఈ విషయాలపై ఆలోచన చేయాలి

తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదిక ప్రకారం హైదరాబాద్ నగరంలో సుమారు ఆరు వేల మంది రోహింగ్యాలు వున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘టీవీ9’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రోహింగ్యాలు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకొచ్చారు? బర్మా ఎక్కడ వుంది? హైదరాబాద్ ఎక్కడుంది? ఇక్కడ ఎవరు షెల్టర్ ఇస్తే వచ్చారు? అని ప్రశ్నించారు.

ఈ విషయాలపై ఆలోచన చేయాలని, ప్రపంచంలో ఏ దేశాన్ని తీసుకున్న తమ దేశంలోకి ఎవరొస్తున్నారు, పోతున్నారన్న విషయమై ఒక లెక్కాపత్రం వుంటుందని, మన దేశానికే అది లేదని అన్నారు. మన దేశ పౌరులకు గుర్తింపు పత్రాలు ఇస్తామంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయని, ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు. దేశ పౌరులకు గుర్తింపు కార్డులు ఇస్తామన్న అంశాన్ని మతానికి ముడిపెట్టడం సరికాదని, ప్రతిపక్షాలు చేసే విమర్శలకు అర్థంపర్థం లేదని ఘాటుగా చెప్పారు. దేశంలో వున్న ఏ మతానికి చెందిన వారైనా భారతమాత ముద్దుబిడ్డలేనని అన్నారు.

  • Loading...

More Telugu News