Andhra Pradesh: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. వివరాలు ఇవిగో!

  • ఇంటర్ తొలి ఏడాది పరీక్షలు  మార్చి 4 నుంచి  
  • రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 5 నుంచి  
  • ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు

ఏపీలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 4 నుంచి, ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. జనవరి 28న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష, జనవరి 30న ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఒకేషనల్ కోర్సుల పరీక్షలకు సంబంధించిన మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 4 నుంచి, రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభం కానున్నాయి.  

ఇంటర్ తొలి ఏడాది పరీక్షలు... 

మార్చి 4న.. ఇంగ్లీషు పేపర్

మార్చి 9.. గణితం-1ఏ, బోటనీ పేపర్-1, సివిక్స్ పేపర్ -1

మార్చి12.. గణితం-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1

మార్చి 14.. ఫిజిక్స్ పేపర్-1, ఎకనమిక్స్ పేపర్-1

మార్చి 17.. కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1,
                ఫైన్ ఆర్ట్స్ పేపర్-1

మార్చి 19..  పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1

మార్చి 21.. జాగ్రఫీ పేపర్-1, మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1

ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు...  

మార్చి 5.. సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2

మార్చి 7.. ఇంగ్లీషు పేపర్-2

మార్చి 11.. గణితం పేపర్-2ఏ, బోటనీ పేపర్-2, సివిక్స్ పేపర్-2

మార్చి 13.. గణితం పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2

మార్చి 16.. ఫిజిక్స్ పేపర్-2బి, ఎకనమిక్స్ పేపర్-2

మార్చి 18.. కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2, సోషియాలజీ పేపర్-2

మార్చి 20.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్- 2

మార్చి 23.. జాగ్రఫీ పేపర్-2, మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2

  • Loading...

More Telugu News