South Asia Games-2019: దక్షిణాసియా క్రీడల్లో భారత అథ్లెట్ల జోరు

  • రెండో రోజు నాలుగు పతకాలు కైవసం
  • పురుషుల 1500మీ. పరుగులో  స్వర్ణం, రజతం
  • మహిళల 1500మీ. పరుగులో రజతం, కాంస్యం

నేపాల్ రాజధాని ఖాట్మాండులో జరుగుతున్న దక్షిణాసియా క్రీడల్లో భారత అథ్లెట్లు తమ జోరును కొనసాగిస్తున్నారు. రెండో రోజు పోటీల్లో నాలుగు పతకాలను గెలుచుకున్నారు. 1500మీ. పరుగులో అజయ్ కుమార్ సారో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సారో 3.50.20 సెకన్లలో పరుగును పూర్తిచేయగా, మరో ఆటగాడు అజిత్ కుమార్ 3.54.18సెకన్లతో పరుగును పూర్తి చేసి రజతాన్ని అందుకున్నాడు. కాగా నేపాల్ కు చెందిన అథ్లెట్ టంకా కార్కి3.57.18 సెకన్లలో పరుగెత్తి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.  

మహిళల 1500 మీ. పరుగులో భారత అథ్లెట్ చందా 4.34.51సెకన్లలో పరుగెత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలుచుకోగా, శ్రీలంక అథ్లెట్ ఉడా కుబురలగె 4.34.34 సెకన్లలో పరుగెత్తి స్వర్ణ పతకాన్ని అందుకుంది. భారత అథ్లెట్ చిత్రా పల్కీజ్ 4.35.46 సెకన్లలో పరుగెత్తి కాంస్యాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటివరకు భారత్ 6 బంగారు, 11 రజత, 4 కాంస్య పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఆతిథ్య దేశం నేపాల్ 28 పతకాలతో అగ్ర స్థానంలో కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News