Jagan: మరింత పెరిగిన ఉల్లి ధర... స్పందించిన సీఎం జగన్

  • ఇప్పటికీ తగ్గని ఉల్లి ధర
  • కిలో రూ.25కే అందించాలని అధికారులకు సీఎం ఆదేశం
  • ఉల్లిని అక్రమంగా నిల్వచేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఇప్పటికీ తగ్గుముఖం పట్టడంలేదు. క్వింటాల్ ఒక్కింటికి ఉల్లి ధర అత్యధికంగా రూ.10,220 పలుకుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు రూ.40 పెరిగింది. తాజాగా, ఏపీ సీఎం జగన్ మండుతున్న ఉల్లి ధరలపై దృష్టి సారించారు. ఉల్లిని అక్రమంగా నిల్వచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మార్కెటింగ్, విజిలెన్స్, పౌరసరఫరాల శాఖలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.  పెరిగిన ఉల్లి ధరల భారం ప్రజలపై పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉల్లి ధరలు తగ్గేవరకు రైతుబజార్లలో కిలో రూ.25కే అందించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వంపై పడే భారాన్ని ధరల స్థిరీకరణ నిధి నుంచి భరించాలని మార్కెటింగ్ శాఖను ఆదేశించారు.

  • Loading...

More Telugu News